Listen to this article

జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండల కేంద్రంలోని సురేఖ మండల సమాఖ్య కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సురేఖ మండల సమాఖ్య అధ్యక్షురాలు గడిపే సుమలత కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళ లేనిదే సృష్టి లేదని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో మహిళలు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి మహిళా శక్తిని చాటుతున్నారని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తున్నారని తెలిపారు మండల సమాఖ్యలో పనిచేస్తున్న సీసీ జిన్నా మంజుల, అకౌంటెంట్ గోలి అనిత, అటెండర్ పాపని మంజులను శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఏపిఎం వేణుగోపాలరావు, సీసీలు విజయకుమార్, శ్రీనివాసరావు, సురేఖ మండల సమాఖ్య కోశాధికారి దాసరి కల్పనాదేవి, వివో అధ్యక్షురాళ్లు, సిబ్బంది పాల్గొన్నారు…..