Listen to this article

జనం న్యూస్ 08 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగుళాంబ గద్వాల జిల్లా జమ్ములమ్మ దగ్గర సునీత ఫంక్షన్ హల్ లో నిర్వహించడం జరిగింది.ఈ శిబిరం లో గద్వాల మండలం, మరియు మల్దకల్ మండలం నాయకులు హాజరయ్యారు..ఈ శిక్షణ కార్యక్రమాలు 6వ తేదీ సాయంత్రం నుండి 7వ తేదీ సాయంత్రం వరకు నిర్వహించడం జరిగింది..ప్రశిక్షణ వర్గ్‌లో మండల స్థాయిలో తెలియజేయవలసిన 11 ముఖ్య కాలాంశాలపై సమగ్ర శిక్షణ అందించబడింది.11కాలాంశాలు పంచ పరివర్తనాలు, బిజెపి చరిత్ర, వికాసం సైదాంతిక భూమిక, మన కార్య పద్ధతి, మన దృష్టిలో కార్య విస్తరణ బూతులో చేయాల్సిన కార్యక్రమాలు ,సోషల్ మీడియా ఏఐ నమో యాప్ ల గురించి సూచనలు అంత్యోదయ ద్వారా సంతృత్యుత్తత కేంద్ర ప్రభుత్వ పథకాలు ,కార్యకర్తల వికాసం, వికసి భారత్ ముందున్న సవాలు, బిజెపి పాత్ర మీడియా సంబంధాలు ఈ శిక్షణ కార్యక్రమాలు రాష్ట్రంలో శిక్షణ పొందిన జిల్లా నాయకులు ఈ కాలాంశాలను మండల బిజెపి నాయకులకు వివరించారు.. ఈ కాలాంశాలలో సమారోప్ కార్యక్రమానికి హాజరైన డికె. స్నిగ్ద రెడ్డి సోషల్ మీడియా ,ఏఐ , నమో యాప్ ల గురుంచి వివరించడం జరిగింది.. నిన్నటి నుండి జరిగిన శిక్షణ తరగతులు రాబోయే ఎన్నికలలో బిజెపి పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలని వివరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు..పార్టీ సిద్ధాంతాలు, వ్యవస్థాపక విలువలు, సంస్థాగత బలోపేతం మరియు సేవా కార్యక్రమాలపై స్పష్టమైన మార్గదర్శనం చేయబడింది.సిద్ధాంత బలం – కార్యాచరణ శక్తి – క్రమశిక్షణతో బిజెపిను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ఈ శిక్షణ వర్గ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు జిల్లా ఇంచార్జ్ బాపు రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శిలు రవికుమార్ ఎక్బోటే,కే కే. రెడ్డి, మాజీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అప్సర్ పాషా,ఈ కార్యక్రమం కన్వీనర్ శ్యామ్ రావ్, కో కన్వీనర్ ,గాంజ సాయి, పెద్దల పోటీ చేసిన అభ్యర్థి బలిగేరా శివారెడ్డి,బిజెపి నాయకులు అయ్యపు రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాసులు, తిరుపతి రెడ్డి మండల నాయకులు హాజరయ్యారు..