తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08
:సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ (జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాజెక్ట్
పెట్టుబడి, తయారీ మండలి)లో త్వరలో హ్యుందాయ్ మోటార్ కంపెనీ (ఈవీ ఆటోమోటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) శంకుస్థాపన జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికిగాను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం 675 ఎకరాల కేటాయించింది. ప్రాజెక్టు గురించి జహీ రాబాద్ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల బృందం నిమ్ పరిధిలోని బర్దిపూర్, ఎల్గోయి, చిలేపల్లి గ్రామాల వద్ద వారికి కేటాయించిన భూమిని పరిశీలించారు. సంస్థ సుమారు రూ. 8,500 కోట్లతో ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ప్రాజెక్టు పూర్తయితే సుమారు 4వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత నిస్తూ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది.



