జనం న్యూస్ మార్చి 9 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా పంచాయతీ కార్యదర్శి ఎన్ యాదగిరి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ జానమొల్ల స్రవంతి రాందాస్ గౌడ్ మరియు వార్డ్ సభ్యులు కుసంగి రజిత, రంగంపేట రాధిక లకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సికింద్రాపురం పోచయ్య, ఉప సర్పంచ్ బండల్ల లింగమయ్య, వార్డ్ సభ్యులు కుమ్మరి పెంటయ్య పాల్గొన్నారు


