Listen to this article

జనం న్యూస్ మార్చి 9, వికారాబాద్ జిల్లా

పరిగి నియోజకవర్గ మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి… మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.మహిళలు ప్రతి రంగంలో ముందంజలో నిలిచి తమ ప్రతిభను చాటుకుంటున్నారని ఆయన అన్నారు. కుటుంబం నుంచి దేశ అభివృద్ధి వరకు మహిళల కృషి అమూల్యమని తెలిపారు. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని మహేష్ రెడ్డి, తెలిపారు.ఈ సందర్భంగా మహిళలకు మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.