జనం న్యూస్ మార్చి 9, వికారాబాద్ జిల్లా
గ్రామీణ పేదలను ఉపాధికి దూరంచేసే ప్రభుత్వం ముందుకు తెచ్చిన ప్రభుత్వ కుట్రలను త్రిప్పి కొట్టాలి
ప్రగతిశీల మహిళా సంఘం(పీ ఓ డబ్ల్యూ) రాష్ట్ర కార్యదర్శి వై. గీత గ్రామీణ శ్రామిక మహిళలకు పిలుపు నిచ్చారు. వికారాబాద్ జిల్లా కేంద్రం పాత ఐసిడిఎస్ ఆవరణలో లో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంను ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే వి బి జీ రామ్ జీ పథకానికి వ్యతిరేకిస్తూ జిల్లా స్థాయి సదస్సు జరిగింది.సదస్సుకు పీ ఓ డబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యురాలు ఏ ప్రభావతి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వై గీత మాట్లాడుతూ, ప్రజలపై తన పాసిస్టు దాడిని తీవ్రతరం చేయడమే కాకుండా కనీసం శ్రమ మీద ఆధారపడి జీవించలేని పరిస్థితికి ప్రజలను నెట్టివేస్తుందని,అందులో భాగమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు పూనుకున్నదని ఆ నేపథ్యంలోనే ముందుకు వచ్చిన విబి జీరాంజీ పథకమని, ఈ పథకం అమలు మూలంగా దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిమంది గ్రామీణ పేదలు,శ్రామిక మహిళలు ఉపాధిని కోల్పోతారని ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, మహిళలు ముందుకు రావాలని కోరారు.నేడు మహిళల రక్షణ కోసమని చెప్పబడుతున్న నిర్భయ,అభయ,దిశ తదితర ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై,పసిపిల్లలపై, వృద్దులపై,ఉద్యోగులపై, చివరికి ప్రాణాపాయం నుంచి కాపాడే మహిళా డాక్టర్ల పై గ్యాంగ్ రేఫ్ లు,మర్డర్ లు జరుగుతుంటే పాలకులకు ఎంత మాత్రం సిగ్గనిపించడంలేదని విమర్శించారు.కులం పేరుతో దళితులను హత్యలు చేస్తున్నారని,బడిలో, గుడిలో దళితులకు స్థానం లేదని పసిపిల్లలను నెలకేసి కొట్టి చంపడం అనాగరిక కాలంలో కూడా జరిగి ఉండదని,అగ్రవర్ణాలు పరువు హత్యలకు పాల్పపడుతుంటే నివారణ చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
మత మూఢత్వం మనిషిలో ప్రవేశిస్తే మానవత్వమనేదే ఉండదని,మనిషి అన్నీ మరిచిపోయి అనాగరికుడుగా మారుతాడని,మానవత్వమే లేకుంటే మనిషి మనుగడ కష్టమని ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా మహిళలు పోరాటాలోకి ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం(పీ ఓ డబ్ల్యూ)జిల్లా నాయకురాలు పద్మమ్మ, సరిత, లక్ష్మి, సునీత, ముని, ఎం ఆర్ పి ఎస్ నాయకురాలు పుష్పలత మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు పాల్గొన్నారు.


