Listen to this article

జనంన్యూస్. 09.నిజామాబాదు. రురల్.శ్రీనివాస్ పటేల్.

నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి సోమవారం ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను ఆలకించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఇందల్వాయి, సిరికొండ, జక్రాన్ పల్లి, మోపాల్, డిచ్ పల్లి, నిజమాబాద్ రూరల్, ధర్పల్లి తదితర మండలాలకు సంబంధించిన గ్రామాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే ను కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఈ మేరకు వారి సమస్యలను విని..వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. తక్షణ పరిష్కారానికి యోగ్యమైన సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు.ఆయా మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.