Listen to this article

డా. తంగళ్ళపల్లి సంతోష్ గౌడ్ నియామకం

జనం న్యూస్ మార్చ్ 9 (బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )

కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామానికి చెందిన డా. తంగళ్ళపల్లి సంతోష్ గౌడ్, ను తెలంగాణ రాష్ట్ర శోధ్ సహా ప్రముఖ్ గా నియమించారు.జైపూర్ (రాజస్థాన్) మహా నగరంలో జరిగిన స్వదేశీ జాగరణ మంచ్ అఖిల భారత సమావేశాల్లో అఖిల భారత కన్వీనర్ ఆర్.సుందరం, జీ ప్రకటించారు.సంతోష్ గౌడ్, తెలంగాణ యూనివర్సిటీలో ( పి హెచ్డీ ) పూర్తి చేసి, ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరోల్ (పరిశోదన ) చేస్తున్నారు. గతంలో ఏబీవీపీలో చాలా కాలం పాటు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన స్వదేశీ జాగరణ మంచ్ కామారెడ్డి జిల్లా సంఘర్షణ ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వహించారు. స్వదేశీ ఉద్యమంలో ఆయన చేస్తున్న పాత్రకు గాను తెలంగాణ రాష్ట్ర సదేశి జాగరణ మంచ్ రాష్ట్ర సంఘటన మంత్రి రచ్చ శ్రీనివాస్ గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను దక్షిణ మధ్య క్షేత్ర సంయోజక్ డా.సత్తు లింగమూర్తి, ఇందూరు విభాగ్ సహసంయోజక్ బొర్ర రాజాగౌడ్, తెలంగాణ రాష్ట్ర యువ ప్రముఖ్ డా.రాహుల్, కామారెడ్డి జిల్లా సంయోజక్ మహేష్ రెడ్డి, తదితరులు అభినందించారు.