

జనం న్యూస్ పిబ్రవరి 12 : ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి : కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకానగర్ కు చెందిన అక్రమ్ ఖాన్ పై మంగళవారం రాత్రి ముగ్గురు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులు దాడికి పాల్పడ్డారు. స్థానిక చిన్న మసీదు ధగ్గర ఉన్న అక్రమ్ ఖాన్ ను రాత్రి ముగ్గురు బియ్యం అక్రమ రవాణాదారులు ఘెరావ్ చేసి విపరీతంగా చికతబాదారు. మంగళవారం ఉదయం సిర్పూర్ (టి) పోలీసులు మూడు వాహనాల్లో విరూర్ కు అక్రమంగా తరలిస్తున్న 208 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనపర్చుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ బియ్యం వాహవానను నువ్వే పట్టించావని, పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ..పోలీస్ ఇన్ఫార్మర్ గా మారావంటూ బూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపిస్తూ తీవ్రంగా కొట్టారని బాధితుడు అక్రమ్ ఖాన్ తెలిపాడు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. తీవ్రంగాగాయపడ్డ అక్రమ్ ఖాన్ ప్రస్తుతం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు.