

జనం న్యూస్ 12 ఫిబ్రవరి : విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవేపై తామరపల్లి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్‌పై గంజాయి కలిగి ఉన్న 3గురు వ్యక్తులను మంగళవారం పట్టుకున్నారు. డిప్యూటీ తాహశీల్దార్, ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో గంట్యాడ ఎస్సై డి. సాయి కృష్ణ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక్కొక్కరి దగ్గర 200 గ్రాములు చొప్పున 600 గ్రాములు గంజాయి, 2 మోటార్ సైకిళ్ళు స్వాదీనం చేసుకున్నారు.