Listen to this article

జనం న్యూస్ మార్చి 09: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండల కేంద్రంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోసోమవారం ముస్లిం సహోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రేమ, సోదరభావం మరియు ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏర్గట్ల సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, నాయకులు దేవుడు నర్సయ్య, శ్యామ్, యూసుఫ్, రొక్కెడ మోహన్ తదితరులు పాల్గొన్నారు