Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,
జనం న్యూస్ 12 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., ఫిబ్రవరి 11న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – ప్రజలతో మంచిగా ప్రవర్తించి, పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలన్నారు. పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు స్టేషనుకు ఏ కారణంతో వచ్చింది తెలుసుకొని, వారు చెప్పే విషయాలను శ్రద్ధగా విని, పరిష్కార మార్గాలను చూపాలని, ఫిర్యాదులను కరించా లన్నారు. విజిబుల్ పోలీసింగులో భాగంగా ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను సందర్శించాలని, రాత్రిపెట్రోలింగు సమయంలో విధిగా లారీ, విజిల్, టార్చిలైటుతోపాటు, వాహనంకు పోలీసు సైరన్ ఉండాలన్నారు. రాత్రి సమయాల్లో అనుమానస్పదంగా సంచరించే వ్యక్తుల వేలిముద్రలను తనిఖీ చేయాలని, పోలీసు స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలకు అందజేసిన ఎఫ్.పి.బి.చెక్ డివైజ్లను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. ఎ.టి.ఎం.లు,బ్యాంకులో చోరీలు జరగకుండా రాత్రి పెట్రోలింగు, గస్తీ నిర్వహించే సమయంలో వాటిని విధిగా సందర్శించి, భద్రతను పర్యవేక్షించి, సెక్యూరిటీ గార్డులను అప్రమత్తం యాలన్నారు . దత్తత కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలుగా వారిపరిధిలోని గ్రామాలను దర్శించి, గ్రామస్థులతో మమేకం కావాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను గుర్తించి, పరిష్క రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మహిళా పోలీసులు (ఎం.ఎస్.పి)లతో ప్రతీ వారం సమావేశాన్ని
నిర్వహించాలని, వారి పరిధిలో గ్రామాలు/వార్డుల్లో శాంతిభద్రతల సమస్యలను, పాత నేరస్థుల ప్రవర్తన, కొత్త వ్యక్తుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. సిసిటిఎన్ఎస్ లో కేసుల వివరాలను, దర్యాప్తు అంశాలను ఎప్పటికప్పుడునమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.డయల్ 100/112 కాల్స్ కు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలంకు చేరుకొని, సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ ఫిర్యాదులను నిర్ధిష్టసమయంలో విచారణ పూర్తి చేయాలని, వారి సమస్యలను పరిష్కరించి, ఆన్లైనులో నివేదికలను నిక్షిప్తం చేయాలన్నారు.రాత్రి 11గంటల తరువాత సహేతుకరమైన కారణం లేకుండా ఎవ్వరూ పట్టణాల్లో తిరగకుండా చూడాలని, అటువంటివ్యక్తులను స్టేషనుకు తరలించి, కౌన్సిలింగు చేయాలని, వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులనుఆదేశించారు. కేసుల్లో రికవరీ/సీజ్ చేసిన ప్రాపర్టీ వివరాలను ప్రాపర్టీ రిజిస్టరులో క్రమపద్దతిలో నమోదు చేయాలన్నారు.మార్చి మాసంలో జరగబోయే నేషనల్ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా ఇప్పటి నుండిప్రణాళికలు రూపొందించుకొని, పని చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. నేరాల నియంత్రణలో సిసి కెమెలు చాలా కీలకమని, ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో సిసి కెమెరాలను స్థానికుల సహకారంతో ఏర్పాటుచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సైబరు క్రైం కేసుల్లో నిందితుల బ్యాంకు అకౌంట్స్లో ఫ్రీజ్ అయిన నగదును బాధితులకు తిరిగి అప్పగించే విధంగా న్యాయ స్థానంలో దరఖాస్తు చేసేందుకు సంబంధిత పోలీసు అధికారులు చొరవ చూపాలన్నారు. క్రైం ఎగినిస్ట్ వుమన్ కేసుల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే పండగలు, తిరునాళ్ళులో డ్రోన్స్ ను వినియోగించి, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు. నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేయాలని, ఇందుకు ప్రత్యేక బృందాలను నియమించి, చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ, రాష్ట్రీ రహదారులపై ఎటువంటి ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం మంజూరు చేసేందుకు ఆర్డీఓ కార్యాలయంలో బాధితులు దరఖాస్తు చేసే విధంగా చూడాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులు, ఎన్టీపిఎస్, మిస్సింగు, 194 బి.ఎన్.ఎన్. కేసులు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పెండింగులో ఉండుటకుగల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు పూర్తి చేయుటకు అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ దిశా నిర్ధేశం చేసి, గ్రేవ్ కేసుల్లో 60 రోజుల్లోగా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.వివిధ విధులను సమర్ధవంతంగా నిర్వహించి, గంజాయి, చోరీలు నియంత్రించుటలోను, లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను డిస్పోజ్ చేయుటలోను, దర్యాప్తు కేసులను తగ్గించుటలోను, నిందితులకు న్యాయస్థానంలో శిక్షలు పడే విధంగా చేయుటలోను, సిసిటిఎన్ఎస్లో కేసుల వివరాలను సకాలంలో అప్లోడ్ చేయుటలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు. రాష్ట్రంలోనే అత్యధిక కేసులను జాతీయ లోక్ అదాలత్లో డిస్పోజ్ చేయుటలోను, బెస్ట్ ఎలక్ట్రోల్ ప్రాక్టీసెస్ అవార్డును ఇటీవల పొందిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందించి, మనంగా సత్కరించారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, డిటిసి డిఎస్పీ ఎం. వీరకుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘురాం, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సిఐలు, ఆర్ఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో ఎస్ఐలు, ఇతర పోలీసు
అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.