Listen to this article

జనం న్యూస్ పెబ్బేరు వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ తేదీ:10/03/2026 మంగళవారం ఉదయం 9 గంటల నుండి యాగశాల ప్రవేశం వంటి పూజా కార్యక్రమాలు మరియు సాయంకాలం నుండి విగ్రహాల జలాధివాసం, పూజ, భజన కార్యక్రమాలు.తేదీ11/03/2026 బుధవారం ఉదయం నుండి గణపతి, నవగ్రహ, వాస్తు, కలశ, దుర్గ హోమాలు మరియు*గంగాదేవి విశేష యజ్ఞం జరుగును.సాయంకాలం 4-00 గంటల నుండి గంగాదేవి ప్రతిష్ట విగ్రహమును పెబ్బేరు పట్టణ పురవీధులగుండ శోభయాత్ర నిర్వహించబడును. అనంతరం ధాన్యాధివాసం శయనాదివాసం భజన వంటి కార్యక్రమాలు నిర్వహించబడును తేదీ:12/03/2026 బుధవారం ఉదయం 8 గంటల నుంచి వివిధ హోమాలు 10-39 నిమిషాలకు గంగమ్మ తల్లి యంత్ర ప్రతిష్టాపన, అనంతరం విగ్రహ ప్రతిష్ట, పూర్ణాహుతి వివిధ పూజ కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 1-00 గంటలకు మహా మంగళహారతి, తీర్థ ప్రసాద కార్యక్రమాలు, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడును. మధ్యాహ్నం 2-00 గంటలనుండి ముదిరాజ్ మహిళా మణులచే బోనం సమర్పణ ఉంటుంది. కావున పైన తెలిపిన కార్యక్రమాలకు పెబ్బేరు పట్టణ ముదిరాజ్ కుటుంబ సభ్యులు, పెబ్బేరు పట్టణ ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయగలను కోరడమైనది.
ఆహ్వానించువారు 1).శ్రీ శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ ఉత్సవ కమిటీ, 2).పెబ్బేరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం. 3).శ్రీశ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే ముదిరాజ్ యువజన సంఘం పెబ్బేరు, మరియు పెబ్బేరు గ్రామ పెద్దలు ప్రజలు