Listen to this article

జుక్కల్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ : సుదీర్ఘ కాలం పాటు ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని నడిపించి, ఎస్సీ వర్గీకరణ సాధనకు అవిశ్రాంతంగా కృషి చేసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిన్న రాత్రి హైదరాబాద్ లోని తన ఇంటికి ఆహ్వానించి పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి సత్కరించారు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ వెంట వచ్చిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ , ప్రముఖ రచయిత మచ్చ దేవేందర్ , పాటమ్మ రాంబాబు , జైభీమ్ టీవీ సంస్థల చైర్మన్ బరిగెల శివని తదితరులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఉద్యమానికి అందించిన సాయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో ఎమ్మెల్యే కృషి మరువలేనిది అని కొనియాడారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు చెందిన ప్రతీ ఒక్కరికీ సామజిక న్యాయం, అభివృద్ధి ఫలాలు అందేలా భవిష్యత్ కార్యాచరణ ఉండాలని చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు..