Listen to this article

జనం న్యూస్ మార్చ్ 10 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మండ కుమార్ స్వామి(45) గీత కార్మికుడిగా కొనసాగుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు లాగానే ఆదివారం సాయంత్రం కల్లు తీసేందుకు తాటిచెట్టు ఎక్కిన కుమారస్వామి అదుపుతప్పి కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలయి రక్తస్రావం అధికంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని బ్లూ లైన్ హాస్పిటల్ లో కుమారస్వామిని చేర్చి చికిత్స అందిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన కుమారస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సహాయం అందించడంతోపాటు వైద్యానికి సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.