Listen to this article

జనం న్యూస్ రోజు పన్నెండు అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ; మంగళవారం లోకసభలో జీరో అవర్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం అంశాన్ని పార్లమెంట్ లో అనకాపల్లి ఎం.పీ డాక్టర్ సీఎం రమేష్ ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్ లో 2019 వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం దుకాణాలు ప్రైవేట్ నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలు గా మార్చి వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.మద్యం దుకాణాల్లో వైయస్ఆర్సీపీ హయాంలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఉద్యోగస్తులను నియమించి ఐదేళ్ల కాలంలో దాదాపు ఒక లక్ష కోట్లు అమ్మకాలు జరిగితే మొత్తం నగదు రూపంలో తీసుకున్నారని ఒక్క రూపాయి కూడా డిజిటల్ గా తీసుకోలేదు అన్నారు.ఢిల్లీ లో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో 10 రెట్ల పెద్ద స్కామ్ అని దాదాపు ముపై వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ఆరోపించారు.వైసీపీ హయాంలో మద్యం దుకాణలులో మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలోనే మాత్రమే జరిగాయని ఈ సందర్బంగా గుర్తు చేశారు.ఇన్ని కోట్ల రూపాయలు అమ్మకాలు లో ఒక్కటి కూడా డిజిటల్ గా లావాదేవీ జరిగిన దాఖలాలు లేవు అని కొన్ని వేల కోట్లు రూపాయలు దారి మళ్లించారని గత ప్రభుత్వం లో జరిగిన లిక్కర్ స్కాంపై విచారణ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు./