

జనంన్యూస్. 12 నిజామాబాదు. ప్రతినిధి.సేవ అయితే –మీకు జీతం ఎందుకు? పెన్షన్ ఎందుకు?ఉద్యోగం అయితే — మీకు పరీక్షలేవి? విద్యార్హతలేవి?జిల్లా. రాష్ట్ర.రాజకీయాల్లో మలుపు రాయి.గతంలో లో రాజకీయ మంటే స్వలాభాపేక్ష లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడం అని నిర్వచనం ఉండేది. అందుకోసం ఎంతో మంది తమ సొంత ఆస్తులను కూడా ప్రజాసేవ కోసం త్యాగం చేసేవారు. ప్రజలు కూడా అలాంటి వారిని గుర్తించి గౌరవించేవారు.ఇప్పుడు వాటి విలువలు రోజురోజుకు పడిపోయి రాజకీయ వ్యవస్థ దిగజారి పోయింది. సేవాభావం కాదుకదా?కనీసం తనను ఎన్నుకొన్న ఓటర్లను గౌరవించే సాంప్ర దాయం కూడా కనిపించడం లేదు. ఏ సమస్యలు పరిష్కరించ డానికి, ఏ అభివృద్ధిని చేయడానికి తనను ఎన్నుకొన్నారుఅన్న స్పృహ కూడా లేకుండా కేవలం వ్యక్తిగత అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తున్నారు . తనకో సమే కాదు తన వారసుల్ని కూడా రాజకీయాలలోకి తీసుకొస్తూ వారికి రాజకీ య ఉపాధి కల్పిస్తున్నారు. రీల్ ప్రగతి మాత్రమే చూపిస్తూ ఇదే రియల్ ప్రగతి అని కన్ను కప్పుతున్నారు.అభివృద్ధి పేరుతో ఉచిత పథకాలు పెట్టి ప్రజల్ని ఆ పథకాలకు బానిసలుగా చేసి సమస్యల గురుంచి మాట్లాడే అవకాశం లేకుం డా చేస్తున్నారు. ప్రశ్నించే వారిపై వేధింపులు . అయి తే ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళను ఎన్నుకొన్నది ఎవరు? మనం కాదా?ఒకడు నేరస్తుడు అని తెలిసి వాడికి ఓట్ వేసి అందలం ఎక్కిస్తే వాడి నేర ప్రవృత్తి వాడు బయట పెట్టుకొంటాడు. గతంలో అనధికారికంగా నేరాలు చేసేవాడు అందలం ఎక్కిన తరువాత అంతా అధికారకంగా చేస్తాడు. అధికార ఎమ్మెల్యే ఒకా యన నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు సమస్యలపై ప్రశ్నించిన ఒక ఓటర్ని అసభ్య పదజా లంతో మీడియా ప్రతినిధుల ముందు దూషించడం జరిగింది.అదే ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు అసభ్యపద జాలంతో సమాధానం చెప్పారు. ఇదంతా ప్రసారమాద్యమాల్లో వచ్చింది. కారణం ఏంటంటే మాకు పదవి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కాదు మమ్మలని మేము అభివృద్ధి చేసుకోడానికి అని సారాంశం. అని చెప్పకనే చెబుతున్నారు.గెలవక ముందు వరకు ప్రజాసేవ, గెలిచిన తరువాత స్వయంసేవ, ఇదీ ఇప్పటి రాజకీయాల కాన్సెప్ట్. అయితే ఇందులో అందరినీ ఒకే గాటన కట్టడం కూడ పద్దతి కాదు. ఇందులో కూడా ఒక మోస్తరుగా ప్రజాసేవ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే వీళ్ళు కొద్ది శాతం మాత్రమే అన్నది నిజం. అవునా కాదా?రాజకీయాలు అంటే ఇప్పుడు అధికారంగా జీతం, అనధికారంగా గీతం ,వారసులకు రాజకీయ ఉపాధి, వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేసే పెన్షన్ ఇది ఒక మార్గంగా ఎంచుకుం టున్నారు.