గ్రామ అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తా సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్,
జనం న్యూస్,మార్చ్ 11,కంగ్టి,
సంగారెడ్డి, జిల్లా కంగ్టి మండల పారధిలోని ముర్కుంజాల్ గ్రామ సచివాలయంలో సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్,అధ్యక్షతన బుధవారం గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గత గ్రామ సభలో చరచించిన అంశాలను వంద శాతం పనులను పరిష్కరించడం జరిగిందని అన్నారు.నేటి గ్రామసభలో సభ దృష్టికి తీసుకువచ్చిన విషయాలను గ్రామంలోని త్రాగునీటి సరఫరా,నర్సరీ మొక్కల పెంపకం,సకాలంలోనే పూర్తి చేస్తామని సభాముఖంగా గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఉపాధి హామీ కూలీలకు దిశా నిర్దేశం చేశారు. ఉపాధి హామీ కూలీలకు ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకు వచ్చినట్టుగా అయితే సమస్యల పరిష్కారానికి సుముఖంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయ్ పాటిల్,పంచాయతీ కార్యదర్శి జ్ఞానదేవ్, వార్డ్ మెంబర్లు రమేష్,మీసాల లక్ష్మి,మాదిగ నర్సింలు,జగన్నాథ్,గైని సాయిలు, కురుమ జ్ఞానేశ్వర్,ముదిరాజ్ శేఖర్,కురుమ శ్రీకాంత్,ఉప్పరి నాగప్ప,కోటగిరి రాములు,మీసాల పెంటన్న,కుమ్మరి కంట్యప్ప, చీమలపాడ్ సాయిలు,గ్రామ పెద్దలు,యువజన సంఘ నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


