Listen to this article

జనం న్యూస్ మార్చి 11: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఏర్గట్లపోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏర్గట్లఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యం వహించి స్వయంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై పడాల రాజేశ్వర్ మాట్లాడుతూ రంజాన్ మాసం త్యాగం, సహనం మరియు సోదరభావానికి ప్రతీక అని తెలిపారు. సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
ఈ ఇఫ్తార్ విందులో ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, నాయకులు,స్థానిక ముస్లిం మత పెద్దలు, మరియు పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది.