జనం న్యూస్ మార్చి 11: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలము లోని తడపాకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తడపాకల్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు జక్కుల నర్సుబాయ్ గంగారం మెమోరియల్ ఆధ్వర్యంలో జక్కుల విజయకుమార్, జక్కుల మోహన్ (హెల్త్ అసిస్టెంట్) పాల్గొన్నారు.అదేవిధంగా స్పందన ఫౌండేషన్ ద్వారా స్వర్గీయ ఇల్లెందుల మోహన్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు నలిన్ శ్రీరాం (లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ మేనేజర్) కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులు, స్కేలు పంపిణీ చేసి వారికి ఆశీర్వాదాలు అందజేశారు.రు మాట్లాడుతూ…“పరీక్షలు భయపడే విషయం కాదు. మీరు సంవత్సరం పొడవునా కష్టపడి చదివిన దానికి ఫలితం చూపించే సమయం ఇది. ధైర్యంగా పరీక్షలు రాసి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి” అని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



