జనం న్యూస్, మార్చ్ 12, జగిత్యాల జిల్లా,
మెట్ పల్లి : పట్టణంలో గల 15వ వార్డ్ కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్ ఈ రోజు త్వరలో ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మెట్పల్లి పట్టణంలో 15వ వార్డు చావిడి వద్ద ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ మరియు సైనిక్ ఫౌండేషన్ తో కలిసి సంయుక్తంగా పెన్నులు మరియు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా సౌనిక్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు అరిగెల రాకేష్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ విద్య అనేది నేటి సమాజంలో చాలా అవసరం అని, విద్య వల్ల మనకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. పరీక్షలు అంటే కేవలం మీ మార్కులను కొలిచే సాధనాలు మాత్రమే కాదు, మీ క్రమశిక్షణను మరియు పట్టుదలను పరీక్షించే సమయం. ఈ సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసం కలిగి, ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. అదేవిధంగా పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే, జీవితమే పరీక్ష కాదు. ఫలితం గురించి అతిగా ఆలోచించకుండా, శ్రమపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అరిగెల రాకేష్ తో పాటు పాఠశాల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు..


