Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : ఈనెల 9వ తేదీ శ్రీకాకుళంలో జరిగిన 30వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ – 2025″ పోటీలలో 70 కేజీల విభాగంలో అనకాపల్లి కి చెందిన పి.సంతోష్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ రోజు అనకాపల్లి అవినాష్ పవర్ జిమ్ లో సంతోష్ ని ఘనంగా సత్కరించారు .ఈ సందర్భంగా అవినాష్ పవర్ జిమ్ చైర్మన్ మరియు న్యాయవాది ఐ.ఆర్.గంగాధర్ మాట్లాడుతూ యువత శారీరక దారుఢ్యంపై అవగాహన పెంచుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరారు. సంతోష్ అనతి కాలంలోనే మిస్టర్ ఆంధ్ర పోటీలలో పాల్గొని మొదటి స్థానాన్ని కైవసం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంతోష్ ని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది శారీర దారుఢ్య పోటీల్లో పాల్గొని అనకాపల్లికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. జిమ్ మేనేజర్ గొర్లి స్వామి గౌడ్ మాట్లాడుతూ అవినాష్ పవర్ జిమ్ నుండి ఎప్పటికే అనేక మంది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి నిత్యం శారీరక శ్రమ సాధన ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ న్యాయవాది అవినాష్ ఇళ్ళ , బుద్ధ గణేష్, పినపాత్రుల సంతోష్, దొడ్డి వెంకటరావు, అయినాల కృష్ణ, డి. హేమంత్, లాలం నరేష్ మొదలవారు పాల్గొన్నారు.//