జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955
ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టండి అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్
వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పరిష్కారాలను కనుగొనుటకు రోడ్డు సేఫ్టీ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేయాలని అడ్వకేట్ సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్ డిమాండ్ చేశారు.జరుగుతున్న ప్రమాదాలలో ఎక్కువ శాతం నివారించదగినవేనని కొంత అవగాహన రాహిత్యం, కొంత నిర్లక్ష్యం, అధికారుల మెతక వైఖరి ఈ ప్రమాదాలకు కారణమని అన్నారు.కొందరు ద్విచక్ర వాహనాలకు, కారులకు అధిక వెలుగునిచ్చే ఎల్ఈడీ బల్బులు వాడటం వలన ఎదుటివారికి వాహనాలను గుర్తించడం కష్టతరంగా మారుతుందని అన్నారు. కొందరు మైనర్లు సరైన నైపుణ్యం లేకుండా వాహనాలను నడుపుతున్నారని ఆ కారణం చేత కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అంతేకాకుండా ప్రమాదాలకు కారణం అవుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రమాదాలు నియంత్రించడం సాధ్యమవుతుందని కనుక రోడ్డు సేఫ్టీ మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకోవాలని కోరారు.


