Listen to this article

జనంన్యూస్. 12.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రి లోని నాలుగవ అంతస్తులో కల డయాలసిస్ కేంద్రం లో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఆసుపత్రి సూపరింట్ డెంట్ డాక్టర్ శ్రీనివాస్ గారు కేక్ కట్ చేసి డయాలసిస్ రోగులు అందరికీ వరల్డ్ కిడ్నీ డే శుభా కాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ డయాలసిస్ రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలు ముందే డయాలసిస్ వరకు రాకుండా కేర్ తీసుకొని హై బీపీ, షుగర్ వ్యాధితో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని ఆహార నియమాలు పాటించాలనికోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జలగం తిరుపతి రావు, డాక్టర్ సాయిరాం, డాక్టర్ రాజశేఖర్,ఆయుష్ విభాగం వైద్యులు డాక్టర్ జె.గంగా దాస్, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ తిరుపతి, నర్సింగ్ సూపరింట్ డెంట్ చంద్రకళ,డయాలసిస్ మేనేజర్ కరుణాకర్, ఇంచార్జ్ మమత, డయాలసిస్ రోగులు, డయాలసిస్ సిబ్బంది పాల్గొన్నారు.