

జనం న్యూస్ ఫిబ్రవరి 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఆర్థిక వృత్తి సాధించవచ్చని లీవ్ ఫామ్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ కృష్ణ అన్నారు మంగళవారం రోజున ఆయిల్ ఫామ్ క్షేత్ర సందర్శన భాగంలో చిలిపిచేడు మరియు కౌడిపల్లి మండలాలలో సాగు చేస్తున్న ఆయిల్ఫామ్ మొక్కలను సిబ్బందితో కలిసి పరిశీలించి మొక్కల పెంపకంపై , ఎరువుల యాజమాన్యంపై, చీడపీడల బెడదపై మరియు ఎండాకాలంలో సంరక్షణ పద్ధతి పై పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో సుమారు 900 ఎకరాలు, కౌడిపల్లి మరియు చిలిపిచేడు మండలాలలో 75 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు అయింది మరియు మరో 100 ఎకరాలలో రైతులు ముందుకు రావడం జరిగింది అన్నారు. మరికొంతమంది రైతులు కూడా ఆయిల్ ఫామ్ పంటను వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు అలాగే కౌడిపల్లి మరియు చిలిపిచెడు మండలాలలో ఎవరికైనా సాగుపై ఆసక్తి ఉంటే ఈ నెంబర్ కి సంప్రదించండి 8328350391