Listen to this article

జనం న్యూస్ 13 మార్చి వికారాబాద్ జిల్లా

వికారాబాద్ పట్టణంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఫర్టిలైజర్ దుకాణాలు మరియు రేషన్ షాపులను శుక్రవారం తనిఖీ చేశారు. రైతులకు సరైన ఎరువులు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఫర్టిలైజర్ షాపులను పరిశీలించారు. ఎరువుల స్టాక్ రిజిస్టర్, అమ్మకాల వివరాలు, ధరలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నాయా అని తనిఖీ చేశారు. అదే విధంగా రేషన్ షాపులను కూడా సందర్శించి, బియ్యం మరియు ఇతర సరుకులు లబ్ధిదారులకు సరిగా పంపిణీ అవుతున్నాయా అని పరిశీలించారు. రికార్డులు సరిగా నిర్వహించాలని, ఎలాంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీల ద్వారా రైతులు – రేషన్ కార్డు దారులకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.