

జనం న్యూస్ పిబ్రవరి 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని అతి ప్రాచీన పురాతన శ్రీశ్రీశ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా నేడు జరిగే జాతర మహోత్సవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ , ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షులు విశ్వ ప్రసాద్ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, జిల్లా పలువురు నాయకులు తో కలిసి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మూడు రోజులు అట్టహాసంగా జరిగె జాతర మహోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఏర్పాట్లు చేసిందని భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలుగు ప్రజల అందరిపై ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయకమిటి సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నరు.