జనం న్యూస్ : పెబ్బేరు మార్చి 13 2026 వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్
వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ ను మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.కాలేజీ కార్యాలయానికి చేరుకున్న చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ను .. ప్రిన్సిపాల్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైద్య కళాశాల అభివృద్ధి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు మరియు ప్రజల ఆరోగ్య సమస్యలపై చర్చించారు.అనంతరం చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ప్రిన్సిపాల్ మల్లికార్జున్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో బుర్రమోని రాముల యాదవ్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


