Listen to this article

జనం న్యూస్ మార్చ్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో మార్చి10 వ తేదీన టీటీడీ వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో ఆరోసారి వార్షిక సత్కారం అందుకున్న ప్రముఖ శైవాగమ పండితులు, భట్టీవిక్రమార్కేశ్వర ఆలయ ప్రధానార్చకులు కాళ్ళకూరి సూరిపండును ఆలమూరు వాసవీ వనితా క్వీన్స్ క్లబ్ సభ్యులు గురువారం ఘనంగా సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో సూరిపండు దంపతులను వారంతా దుశ్సాలువా, పూలమాలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తితిదే సత్కారం దక్కడం సూరిపండుతో పాటు ఆలమూరుకు సైతం గర్వకారణమన్నారు.కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు వెత్సా రాధిక,కార్యదర్శి కంచర్ల శారద, కంచర్ల మల్లిక, కంచర్ల స్వాతి,వెత్సా సునంద,వెత్సా లక్ష్మీ శ్రీనివాస్ తో పాటు పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.