జనం న్యూస్ మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా మండలాల వారీగా లబ్ధిదారులకు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
ముమ్మిడివరం మండలం – 28 మంది లబ్ధిదారులకు ₹17,18,195.ముమ్మిడివరం నగర పంచాయతి – 12 మంది లబ్ధిదారులకు ₹5,64,919.కాట్రేనికోన మండలం – 29 మంది లబ్ధిదారులకు ₹10,61,625.ఐ. పోలవరం మండలం – 32 మంది లబ్ధిదారులకు ₹17,35,992.తాళ్లరేవు మండలం – 38 మంది లబ్ధిదారులకు ₹17,04,287మొత్తం 143 మంది లబ్ధిదారులకు ₹ 71,35,250 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు గారు మాట్లాడుతూ, ప్రజలకు అత్యవసర వైద్య అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా వేగవంతంగా సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.అదేవిధంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం సుమారు ₹5 కోట్లు 8 లక్షల రూపాయల సీఎంఆర్‌ఎఫ్ సహాయం అర్హులైన బాధిత కుటుంబాలకు అందించడం జరిగిందని తెలిపారు.ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం చేరేలా నిరంతరం కృషి కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి నియోజకవర్గ కూటమి నేతలు కార్యకర్తలు లబ్ధిదారులు ప్రజలు మీడియా మిత్రులు పాల్గొన్నారు.



