జనంన్యూస్ 13.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
బాసర త్రిబుల్ ఐటీ ముందట P D S U నిరసన
బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై, అవినీతి పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పి డి ఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బాసర త్రిబుల్ ఐటీ ముందు పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా పేరుపొందిన బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులు ఏటా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని , ఆత్మహత్యలకు గల వాస్తవ కారణాలను యూనివర్సిటీ అధికారులు వెల్లడించాలని , విద్యార్థుల ఆత్మహత్యలను వెంటనే నివారించాలని అన్నారు.అదే విధంగా యూనివర్సిటీ లో అడ్మిషన్స్ జరిగిన విధానంపై మరియు రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి విడుదలైన నిధుల ఖర్చులపై , అన్ని రకాల టెండర్ ప్రక్రియ చెల్లించిన బిల్లులపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులతో విచారణ జరపాలని, కొన్ని డిపార్ట్మెంట్ లలో చాపకింద నీరులా ర్యాగింగ్ జరుగుతుందని వెంటనే అరికట్టాలని , విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలను విద్యార్థులను కలవడానికి అనుమతి ఇవ్వాలని అన్నారు.సమస్యలు పరిష్కరించనిచో పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు మనోజ్,అక్షయ్, రాకేష్,గౌతం, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.



