

జనం న్యూస్ ఫిబ్రవరి 12 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ : ఆంధ్రా నుంచి తెలంగాణకు బాయిలర్ కోళ్లను తరలించకుండా ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. బాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో ఆంధ్రా నుంచి తెలంగాణకు బాయిలర్ కోళ్లను తరలించకుండా పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 6 వ తేదీన ఆదేశాలు జారీ చేయడంతో రోజుకు ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున వెటర్నరీ సంబంధిత అధికారులు ఏపీ, తెలంగాణ బోర్డర్లో విధుల్లో ఉన్నారు.