జనం న్యూస్ మార్చ్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
నిరుద్యోగ యువతీ యువకులకు కూటమి ప్రభుత్వం ఉగాదికి మరో జాబ్ క్యాలెండర్ పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రభుత్వంలో 60 విభాగాల్లో ఉన్న పోస్టులకు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతీ యువకులకు ఇచ్చిన హామీ ప్రకారం 6,28,347 ఉద్యోగాలు కల్పించారని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ప్రభుత్వం ఉద్యోగాలు 30,607 డీఎస్సీ, కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేశారని, ఎంఎస్ఎంఈ ల నుండి ఉపాధి 2,48,906 పొందారని, జాబ్ ఫెయిర్, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి పరిశ్రమ రంగాల నుండి 95,174 ఫుడ్ ప్రాసెసింగ్ నుండి 64,035 ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్స్ 13,866, పర్యాటక రంగం నుండి 5,028 నుండి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖమాత్యులు నారా లోకేష్ యువతికి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళుతుంటే వైసిపి అధినేత ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ రెడ్డి పరిశ్రమలు రాకుండా కోర్టుల్లో తన అనుచరుల చేత కేసులు వేయిస్తూ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ, ప్రపంచ బ్యాంకు ఇతర సంస్థలకు అప్పులు ఇవ్వద్దని మెయిల్స్ చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని నాగ జగదీష్ మండిపడ్డారు. ఒకపక్క కోర్టు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ అమరావతి నిర్మాణానికి అడ్డంకులు కల్పిస్తూ గూగుల్ సంస్థలు, కాగ్నిజెంట్, టిసిఎస్ లపై ఇప్పటికే కేసులు వేసి సుప్రీంకోర్టు,హైకోర్టులో కేసులు విగీపోయినా సిగ్గు లేకుండా నిరంతరం బ్లూ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని నాగ జగదీష అన్నారు. హిందూ సమాజం పైన తిరుమల తిరుపతి దేవస్థానం పైన లడ్డు కల్తీపై భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ, దీనిపై మాట్లాడకుండా సుప్రీంకోర్టులో కేసులు వేసి చివాట్లు తిన్నారని, అయినప్పటికీ వీరిలో పరివర్తన రాలేదని, ఇక జగన్ రెడ్డి వారి గ్యాంగ్ వారానికి ఒకసారి మీడియా సమావేశం పెట్టి సూపర్ సిక్స్ పథకాలు అమలు కాలేదని, ప్రజలను మోసం చేస్తున్నారని, అబద్ధపు ప్రచారాలు చేయడం జగన్ రెడ్డికే చెల్లిందని, మరోపక్క అన్యమతస్తులు పవన్ కళ్యాణ్ పై సనాతన ధర్మం గురించి మాట్లాడితే ముక్కలు ముక్కలుగా నరుకుతామని హెచ్చరికలు చేస్తున్నారని, హింసను ప్రేరేపిస్తున్న ఇటువంటి వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలని నాగ జగదీష్ ప్రభుత్వాన్ని కోరారు. విలేకరుల సమావేశంలో శ్రీ భోగ లింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ బీసీ నాయకులు కొమ్ముజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.//


