

తెలంగాణ స్వధర్మ దూప దీప నైవేద్య అర్చకుల సంఘం
జనం న్యూస్ ఫిబ్రవరి 12 ( వనపర్తి జిల్లా పానగల్ మండల ప్రతినిధి కల్మూరి వెంకటేష్ ) చిలుకూరు బాలాజీ అర్చకులు ప్రముఖ సంఘ సంస్కర్త, మానవతావాది,విద్యావేత్త న్యాయ పోరాటం చేసి ఎన్నో విజయాలు సాధించిన ఎల్లవేళల అర్చకుల శ్రేయస్సుకు పాటుబడే శ్రీ రంగాజన్ పై దాడిని ఖండిస్తున్నామని తెలంగాణ స్వధర్మ దూప దీప నైవేద్య అర్చకుల సంఘం రాష్ట్ర అద్యక్షులు శఠగోపం శ్రీనివాస ఆచర్యులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామరాజ్యం పేరు తో చిత్ర హింసలుపెట్టి శ్రీరంగరాజన్ పై దాడికి దిగడం గర్హనీయం, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు ఏదైనా రాజ్యాంగ బద్దంగ ఇలా దాడులకు తెగబడటం తప్పు అందుకే మా తెలంగాణ స్వధర్మ ధూప దీప నైవేద్య అర్చక సంఘం ద్వారా దీనిని ముక్త కంఠం తో తీవ్రంగ ఖండిస్తున్నాము .ఈ విషయం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పందించి ఫోన్ ద్వార రంగరాజన్ గారిని పరామర్శ చేయడం స్వయంగ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖమ్మ వారి వద్దకువెళ్లి ధైర్యం చెప్పి దాడికి పాల్పడిన వారిని కఠినంగ శిక్షిస్తామని తెలుపడమే కాక ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించడం, శుభపరిణామం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశం లో సీనియర్ నాయకులు బుచ్చిలింగం , ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, మున్ననూరు వెంకటన్న,శశాంక శర్మ, ఆనందు, అనంతరాములు తదితర అర్చకులు పాల్గొన్నారు.