Listen to this article

జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి

అమరావతి లో మార్చి 16 అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంశ్య విగ్రహం ఆవిష్కరణ మహోత్సవం తణుకు ఆర్యవైశ్య సంఘాల కి ఆహ్వానం మన ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ అయినా పద్మనాభుని మురళి ఈరోజు మన సంఘమునకు విచ్చేసి అమరావతిలో నిర్మిస్తున్న 58 అడుగుల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ ఈ నెల16వ తేదీ అనగా శ్రీ పొట్టి శ్రీరాములు వారి జయంతి రోజున అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం చేస్తున్నారని దానిలో ముఖ్యమంత్రివర్యులు, ఉపముఖ్యమంత్రి వర్యులు తదుపరి పెద్దలు కూడా పాల్గొంటారని మన సంఘము వారిని కూడా తప్పకుండా రమ్మని చెప్పి మన అధ్యక్షులు అయినటువంటి శ్రీ మాజేటి హనుమత్ ప్రసాద్ ని మరియు, కార్యనిర్వాహక అధ్యక్షులు గాదె ఫణి ని తదితరులను కలిసి ఆహ్వానించినారు. అందువలన మన సభ్యులు అందరూ కూడా వీలైనంతవరకు కుదిరిన వారు కార్యక్రమమునకు వెళ్ళవలసినదిగా కోరడమైనది .అట్లానే మనకు తెలుసున్న ఇతరులను కూడా వెళ్ళుటకు ప్రోత్సహించవలసిందిగా కోరడమైనది.:మన సంఘము తరపున వెళ్లేదిగా ఉంటే తెలియజేయగలవాడను. నాకు తెలిసిన సమాచారం మేరకు కొంతమంది పెద్దలు మన తణుకు నుండి వెళ్ళుచున్నారు.