

జనం న్యూస్ మధిర రూరల్ ఫిబ్రవరి 12 దోర్నాల కృష్ణ : ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని మధిర సిఐ మధు పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆంధ్ర ప్రభతో మాట్లాడుతూ అపార్ట్ మెంట్లో, దుకాణాల్లో, వాణిజ్య సముదాయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వంద మంది పోలీసులు చేసే పని ఒక్క సీసీ కెమెరా పని చేస్తుందన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దుకాణాల్లో ఎటువంటి సంఘటనలు జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. వ్యాపారులు తప్పనిసరిగా దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదేవిధంగా అపార్ట్మెంట్లలో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అపార్ట్మెంట్ లోనికి అపరిచిత వ్యక్తులు వచ్చినా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఖమ్మం కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు వైరా ఏసిపి రెహమాన్ సూచనల మేరకు మధిర సర్కిల్లో ప్రతి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు వ్యాపారులకు సిసి కెమెరాల పై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు అదేవిధంగా గంజాయి గుట్కా మత్తు పదార్థాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఇప్పటికే విద్యార్థులకు మధిర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించడం జరిగిందన్నారు. ప్రజలు ఎటువంటి ఆపదలో ఉన్న తక్షణమే 100 ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు చేరుకొని ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటారని ఆయన తెలిపారు అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.