జనం న్యూస్,మార్చి14,అచ్యుతాపురం:
సామాన్యుడికి అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశానుసారం అచ్యుతాపురం మండలం ఉప్పవరం గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన జెండా ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని జనసేన శ్రేణులు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప్పవరం జనసేన పార్టీ అధ్యక్షులు చిన్న దొరబాబు, ఉపాధ్యక్షులు కాయల అప్పలరాజు, బీసీ అధ్యక్షులు కోమాకుల వెంకట రవి ప్రసాద్, యూత్ ప్రెసిడెంట్ పల్లెల రామ గణేష్, గోరువాణి గెడ్డ, ఉపాధ్యక్షులు కాయల వసంతరావు, సూరిబాబు కొత్తపల్లి ధర్మరాజు ఎల్ఐసి త్రినాధ్, పల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.


