

తిరుమలగిరి ఫిబ్రవరి 12 జనం న్యూస్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన కుంభం సతీష్ గౌడ్ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనుకోకుండా చనిపోయిన వారికి 5000 రూపాయలు, క్వింటా బియ్యం పలు రకాల సహాయ సహకారాలు అందిస్తూ పేద బలహీన వర్గాలను ఆదుకునే దాంట్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉన్నారు. మానవత కోణంలో పేద ప్రజలను ఆదుకోవటమే నా కర్తవ్యం అని కుంభం సతీష్ తెలిపారు. బుధవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగుతున్నానని తెలిపారు. జీవితం ఉన్నంతకాలం పేద ప్రజలకు సేవ చేయడమేనని రేపు రాబోవు ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఎంపీటీసీగా,జెడ్పిటిసి గా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరిన్ని సేవలు చేయడానికి రాజకీయపరంగా ముందుంటాను అని తెలిపాడు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు