Listen to this article

జనం న్యూస్ 14 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఎమ్మార్పీఎస్ ను వాడుకుంటున్నారు.ఈ గొడవకు ఎమ్మార్పీఎస్ కు ఎలాంటి సంబంధం లేదు.మాజీ ఎంపిటిసి మద్దిలేటి మాదిగ. నాగార్జున మాదిగ.జయరాజు వేదింపులనుండి మాకు విముక్తి కల్పించండి!ఎమ్మార్పీఎస్ పైన మంద కృష్ణ మాదిగ పైన మాకు గౌరవం అపారమైన నమ్మకం ఉంది కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం కావాలని ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపిటిసి మద్దిలేటి మాదిగ, నాగార్జున మాదిగ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం అలంపూర్ చౌరస్తాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బిడ్డల మైన,మా భూముల పై అధికారులకు తప్పుడు పిర్యాదులు చేస్తూ, మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు, దళితులకు సంబంధించిన మా భూమిలో మేము చిన్నపాటి వ్యాపారం చేసుకుంటుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం కుడా మా పై కలెక్టర్ కి పిర్యాదు చేశారు. అంతేకాక జయరాజు అనే వ్యక్తి మీరు తొందరగా మాతో మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకోవాలని లేకపోతే మరింత ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించారు.ఇట్టి విషయం గురించి అలంపూర్ చౌరస్తా లోగల హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఉన్నా, జయరాజు ను మేము కలిశాము. మమ్మల్ని జయరాజు బూతు మాటలు తిడుతూ మునుముందు మిమ్ములను మరింత ఇబ్బందులకు గురి చేస్తానని ఆగ్రహించారు. మమ్మల్ని బూతు మాటలు తిడుతూ కొట్టే ప్రయత్నం చేయగా మేము అడ్డుకున్నాం. ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని వేడుకున్నాం కానీ వినకుండా మీ ఊరికే పోదాం పాండి మన ఎస్సీ పెద్దలను పిలుచుకొని మాట్లాడదామని చెప్పి నా కారు దగ్గరికి రావడంతో అతన్ని కారులో ఎక్కించుకొని గ్రామానికి వెళ్ళాం. అంతేకానీ దాడి చేయకుండా దాడి చేశామని దుష్ప్రచారం చేయడం సరి కాదని అన్నారు.మేము కూడా దళిత బిడ్డలమే, అనేక సార్లు యం ఆర్ పి యస్ కార్యక్రమాల కు వొచ్చాం, అనేక మీటింగ్స్ కు జయరాజ్ కు జీపులు ఏర్పాటు చెయ్యడం, ఖర్చుల కు డబ్బులు కుడా ఇవ్వడం జరిగింది,ఇంతకు ముందు యం ఆర్ పి యస్ చలో ఢిల్లీ పోగ్రామ్స్ కుడా దాదాపు 11 మంది కి ఫ్లైయిట్ టిక్కెట్స్ కుడా బుక్ చేసి పంపించడం జరిగింది,అంతే కాకుండా మా యొక్క పొలం విషయం లో అధికారుల కు పిర్యాదు చేసి, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే, చాలా సార్లు డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు. అయిన మమ్మల్ని పదే, పదే టార్గెట్ చేస్తున్నారు. ఈ సంఘటన కొంతమంది రాజకీయంగా కుట్ర చేస్తున్నారని అన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు లేని వారిని కూడా ఇందులో జతపరిచి రాజకీయంగా కక్ష సాధింపు చేయాలని చూస్తున్నారు.మా గొడవ కు, యం ఆర్ పి యస్ కు ఎటువంటి సంబంధం లేదు.ఇట్టి… విషయం గురించి త్వరలోనే గౌరవ మంద కృష్ణ మాదిగ ని కలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి రవి తదితరులు పాల్గొన్నారు.