Listen to this article

జుక్కల్ మార్చ్ 16 జనంన్యూస్. కమారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో

ఆదివారం నాడు సాయంత్రం 6 గంటల సమయంలో జుక్కల్ పరిసర ప్రాంతంలో ఉన్న జుక్కల్ వాగు నుండి ఒక ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా గుండూర్ గ్రామం వైపు తరలిస్తున్నారని సమాచారము రాగా జుక్కల్ పోలీస్ వారు వెళ్లి ఆ ట్రాక్టర్ ని అదుపులోకి తీసుకున్నారు ఈ ట్రాక్టర్ ను జుక్కల్ పోలీస్ పోలీస్ స్టేషన్కు తరలించి ఆ ట్రాక్టర్ పై కేసు నమోదు చేశామని ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.