జనం న్యూస్ 17మర్చి పెగడపల్లి జగిత్యాల జిల్లా
పెగడపల్లి మండలం లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మర్రిపల్లి సత్యం, గంగల కొమురెల్లి మరియు చింతకింద అనసూయ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని రైతు బందు 15000 ఇవ్వాలని రైతు బోనస్ ఇవ్వాలని మహిళలకు 2500 ఇవ్వాలని పెన్షన్లు 4000 ఇవ్వాలని విద్యార్థుల ఫీజు రెంబర్స్మెంట్ ఇవ్వాలని అంబేద్కర్ అభయ హస్తం కింద దళితులకు 12000 ఇవ్వాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు తులం బంగారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ పెగడపల్లి డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. వీటిపై డిప్యూటీ తాసిల్దారు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల ప్రధాన కార్యదర్శి తోడేటి గట్టయ్య ప్రజా ప్రతినిధులు ఉప సర్పంచ్ మరియు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కాకాల సతీష్ వార్డు సభ్యులు కడారి రాజిరెడ్డి కూన కుమార్ మండల ఉపాధ్యక్షులు కోట మల్లేశం మండల కార్యదర్శి కడారి జనార్ధన్ బీజేవైఎం మండల ప్రెసిడెంట్ జక్కుల హరీష్ ఎస్సీ మోర్చా మండల ప్రెసిడెంట్ తడగొండ శ్రీనివాస్ శక్తి కేంద్ర ఇన్చార్జిలు శేపూరి సురేష్ కూన సాగర్ పాలోజి శ్రీరామ్ బూత్ అధ్యక్షులు నిఖిల్ గౌడ్ బీరయ్య రాజేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


