Listen to this article

జనం న్యూస్, మార్చి 16 – తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి: శ్రీనివాస్ రెడ్డి

కూకట్‌పల్లి పరిధిలోని గోపాలనగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ వెలుతురు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నేత గాదె శివ జీహెచ్‌ఎంసీ ఎలక్ట్రికల్ విభాగం డీఈ స్వప్న రాజును కలిసి వినతిపత్రం సమర్పించారు.గోపాలనగర్ నూతన పార్కు చుట్టుపక్కల సరైన వీధి లైట్లు లేకపోవడంతో రాత్రివేళల్లో ప్రాంతం మొత్తం చీకటిలో మునిగిపోతుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గాదె శివ వివరించారు. ఈ నేపథ్యంలో పార్కు పరిసర ప్రాంతాల్లో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి లైట్లు అమర్చాలని ఆయన అధికారులను కోరారు.అదేవిధంగా ఎస్‌ఎంఆర్ వినయ్ నుంచి గోకుల్ ప్లాట్స్ వరకు, అలాగే ఎస్‌ఎంఆర్ వినయ్ నుంచి ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కాలనీ వరకు సుమారు ఒక కిలోమీటర్ మేర నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి లైట్లు అమర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మార్గాల్లో వెలుతురు లేకపోవడం వల్ల రాత్రివేళల్లో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.వినతిపత్రంపై స్పందించిన జీహెచ్‌ఎంసీ ఎలక్ట్రికల్ విభాగం డీఈ స్వప్న రాజు, అవసరమైన అంచనాలను సిద్ధం చేసి టెండర్ ప్రక్రియ పూర్తిచేసిన అనంతరం ఒక నెలలోపే నూతన విద్యుత్ స్తంభాలు మరియు వీధి లైట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కెపిహెచ్‌బి డివిజన్ మరియు వసంత నగర్ డివిజన్లలో ప్రజల అభ్యర్థన మేరకు ప్రతి కాలనీలో వీధి లైట్లు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్న జీహెచ్‌ఎంసీ ఎలక్ట్రికల్ విభాగం అధికారులకు గాదె శివ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.