Listen to this article

జనం న్యూస్, మార్చి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ అని, ఈ పవిత్ర నెలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం అభినందనీయమని టీపీసీసీ కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.సోమవారం నియోజకవర్గ పరిధిలోని భరత్ నగర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రంజాన్ కిట్లను ఆయన ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరస్పర సౌహార్దంతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ఖలీల్ ఆధ్వర్యంలో బియ్యం, పప్పులు తదితర ఆహార పదార్థాలను కూడా అవసరమైన వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఖలీల్, మహమ్మద్ షరీఫ్, బాకీ బాయ్, తూము సంతోష్ తదితరులు పాల్గొన్నారు.