జనం న్యూస్ మార్చ్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఉత్తరాంధ్ర ఇలివేలుకు రాష్ట్ర పండగ గుర్తింపు పొందిన అనకాపల్లిలో గవరపాలెం లోవెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జాతర, కొత్త అమావాస్య, ఉగాది మహోత్సవాలు భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసామని దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను (గొల్ల బాబు), ఆలయ కార్య నిర్వహణ అధికారి యాళ్ళ శ్రీధర్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ. ఈనెల 17, నుండి వచ్చేనెల 17 వరకు నెలరోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని,జాతర, కొత్త అమావాస్య కు ఆలయానికి వచ్చే భక్తులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. క్యూలైళ్లు శాలవా పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు,ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు దృష్టి ఉంచుకొని క్యూ లైన్ లో ఉండే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, చిన్నపిల్లలకు పాలు సరఫరా చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, ఈ ఏడాది భారీ విద్యుత్ అలంకరణ, స్టేజ్ ప్రోగ్రామ్, నేల వేషాలు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు,ఎటువంటి సంఘటన జరుపుకుంటా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని వీటితోపాటు మెడికల్, ఫైర్ ,జీవీఎంసీ, విద్యుత్, శాఖ అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారని అని తెలియజేశారు./


