జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 16
రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమిప్రభుత్వంపనిచేస్తోందనిమార్కాపురంశాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం తర్లుపాడు మండలంలోని బుడ్డపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీకోసం” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఇంటింటికి అధికారులు.. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంసభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడత ఇంటింటి సర్వేనుఅధికారులు పకడ్బందీగానిర్వహిస్తున్నారని తెలిపారు. అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్లి, వారి సమస్యలను నమోదు చేసుకుని నేరుగాప్రభుత్వానికి నివేదిస్తున్నారని, తద్వారా అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.ఏడాదికి రూ. 20 వేల సాయం రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని ఆయన వెల్లడించారు. ఏడాదికి ప్రతి రైతుకు 20 వేల రూపాయల ఆర్థికసాయంఅందిస్తున్నామని, ఇది ముమ్మాటికీ రైతు పక్షపాత ప్రభుత్వమని కొనియాడారు.వ్యవసాయ రంగంలో రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలని ఎమ్మెల్యే ఒకే రకమైన పంటలు వేయకుండా, పంట మార్పిడి పద్ధతులు పాటిస్తే దిగుబడి గణనీయంగా పెరుగుతుందనిఅన్నారు.వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతమంతా ‘హార్టికల్చర్.హబ్’ (ఉద్యానవన కేంద్రం)గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారి, ప్రజల బతుకుల్లో వెలుగులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


