Listen to this article

జనం న్యూస్ మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో ఆలమూరు పండితుడికి ఘనసత్కారం…
పట్టణంలోని స్థానిక నూకాలమ్మ అమ్మవారి 62వ ఉగాది ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ప్రత్యేక అతిథిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు వాస్తవ్యులు ప్రతిష్టాచార్య ఉపన్యాస వాచస్పతి టీటీడీ వార్షిక సత్కార పండితులైన బ్రహ్మశ్రీ కాళ్లకూరి సూర్య ( సూరిపండు ) వారిని దేవి వైభవం గురించి ప్రవచనం చెప్పడానికి ఆలయ చైర్మన్ న మహారాజశ్రీ రాజాన సత్యనారాయణ ( పండు ) గారు స్థానిక అర్చకులు కాళ్లకూరి మహేష్ ద్వారా ఆహ్వానించి ఈ సందర్భంగా భక్తుల విరాళాల ద్వారా వచ్చినటువంటి 16 కేజీ ల వెండి చీర ని స్థానిక గ్రామ దేవత అయిన గంగానమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి మేళ తాళాలతో భాజా భజంత్రీలతో అమ్మవారి గరగల నాట్యాలతో, కోలాట నృత్య ప్రదర్శనలతో సుమారు వెయ్యి మంది మహిళలతో కలశలతో మూడు కిలోమీటర్ల మేర ఊరేగింపు తో ” అమ్మవారి వెండి చీరను గ్రామోత్సవంలో ఊరేగింపు చేసి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినటువంటి మన ఆలమూరు పండితుడు చేతుల మీదుగా నూకాలమ్మ తల్లికి అలంకరింపచేసి సూరిపండు వారిచే ” దేవివైభవం ” హిందూ సాంప్రదాయాలు మీద ప్రవచనాలు చెప్పించి టీటీడీ వార్షిక సత్కార పండితులైన బ్రహ్మశ్రీ కాళ్లకూరి సూరిపండు ని దుస్సాలువాలతో మరియు అమ్మవారి సారె తో తల పుష్ప నూతన వస్త్రాలతో సత్కరించి నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు అందుకుని స్థానికంగా విన్నటువంటి మహిళా భక్తులకి మరియు అక్కడ సేవలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు రమణీయకంగా ఆమోదయోగ్యంగా భావితరాల వారు సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునే విధంగా ఉన్నాయని స్థానిక కమిటీ సభ్యులు చైర్మన్ భక్తులు వీరిని సత్కరించి వీరిని అభినందించిరి….