Listen to this article

జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని తుంపల్లి యువకులు బతుకు తెరువు కోసం ఖత్తర్ దేశానికి వెళ్లిన గ్రామానికి చెందిన యువకులు అక్కడ ఒక బృందంగా ఏర్పడి తమ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలను గుర్తించి వారు తమ వంతు సహాయాన్ని అందిస్తూ మానవతను చాటుతున్నారు.ఇటీవల పెళ్లి చేసుకున్న మంజుల అనే యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె పరిస్థితిని గమనించిన ఖత్తర్ బృందం రూ.5,000 ఆర్థిక సహాయం అందించింది. అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన నరసయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని ఆయన వైద్య ఖర్చుల కోసం రూ.45,000 సహాయం చేశారు.అదేవిధంగా రమేష్ అనే యువకుడు అకాల మరణం చెందడంతో ఆయన కుమార్తె పేరుపై రూ.13,000 డిపాజిట్ చేశారు. అలాగే రజినీస్ అనే వ్యక్తి చెట్టు మీద నుంచి పడిపడి మరణించడంతో ఆ కుటుంబానికి రూ.12,000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ విధంగా గ్రామంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఖత్తర్ బృందం అండగా నిలుస్తూ సహాయం చేయడం పట్ల తూంపల్లి గ్రామ ప్రజలు ఆ బృందంలోని సభ్యులను అభినందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.సహాయం అందిస్తున్న ఖత్తర్ బృందం సభ్యుల్లో కాసుల పెద్ద లింగం, జింక శేఖర్, కాసుల రాజన్న, బైకన్ మురళి, రావుట్ల రవీందర్, గుర్రపు సాయన్న, కేతావత్ రాజేష్ తదితరులు ఉన్నారు.