బిచ్కుంద మార్చి 16 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) బిచ్కుందలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఇన్ రీసెర్చ్ మెథడాలజీ అనే అంశంపై ఒకరోజు జాతీయ కార్యశాలను తేదీ25 /03/2026 బుధవారం రోజున జరిగే కార్యక్రమ కరపత్రం ను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె .అశోక్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులు మరియు పరిశోధన ప్రాముఖ్యత వివరించడానికి ఈ కార్యశాల ఒక వేదికగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యాశాల ద్వారా విద్యార్థులకు పరిశోధకులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. కార్యశాల కన్వీనర్ డాక్టర్ జి. వెంకటేశం మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల ఆచార్యులు విచ్చేయుచున్నారని పరిశోధక విద్యార్థులు, పిజి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు


