Listen to this article

జనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ప్రస్తుతం రంజాన్ పండుగ సందర్భంగా బంగ్లాదేశ్ సరిహద్దు మూసివేసినందున రాబోవు 10 రోజుల వరకు మిర్చి కోసం ఎగుమతులు లేనందున తేజ డీలక్స్ సరుకు డిమాండ్ కొరవడింది. అయితే ప్రస్తుతం సానుకూల వాతావరణం వలన గుంటూరు మరియు పరిసర ప్రాంతాలలో మిర్చి పంట కోతల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. మరియు నాణ్యమైన సరుకు రాబడులు పెరుతున్నాయి. కాగా, కొనుగోలుదారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున ఎక్కువ శాతం సరుకు శీతల గిడ్డంగులలో నిల్వ కోసం తరలించబడుతున్నది.దేశంలోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి గత వారం సుమారు 15 లక్షల బస్తాల మిర్చి రాబడి అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఉత్పత్తి తగ్గినందున ధరలపై అంతగా ప్రభావం చూపడం లేదు.విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుత సంవత్సరం సీజన్ ప్రారంభం నుండి ఇంతవరకు గుంటూరు మిర్చి యార్డులో గత ఏడాది 65 లక్షల 92 వేల బస్తాల సరుకుతో పోలిస్తే ఈ సారి తగ్గి 39 లక్షల 57 వేల 844 బస్తాలకు పరిమితమెంది. ఇందుకు ముఖ్య కారణమేమనగా, ఉత్పత్తి తగ్గడం మరియు రైతుల సరుకు నేరుగా శీతల గిడ్డంగులలో నిల్వ కోసం వెళ్తోంది. గత వారం నిర్వహించిన లావాదేవీలలో గుంటూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పల్నాడు, ప్రకాశం, క్రిష్ణా, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల నుండి 5 లక్షల 40 వేల బస్తాల మిర్చి రాబడి కాగా, గతవారం మిగులు నిల్వలు సహా 5 లక్షల 95 వేల బస్తాల సరుకు విక్రయించబడింది. ఇందులో కేవలం సోమవారం మార్చి 9 నాడు సుమారు 1 లక్ష 70 వేల బస్తాల సరుకు రాబడి కాగా, సుమారు 1లక్ష 50 వేల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో తేజ డీలక్స్ రూ. 500, పసుపు పచ్చ సరుకులో రూ.1000, అన్ని మీడియం, మీడియం బెస్ట్ రకాలలో 500-1000 నాణ్యతానుసారం తగ్గింది. మిగిలిన రకాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సానుకూల వాతావరణం నెలకొన్నందున గుంటూరు మరియు పరిసర ప్రాంతాలలో పంట కోతల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. నాణ్యమైన రకాలు మార్కెట్లలోనికి వస్తున్నప్పటికీ, వ్యాపారుల కొనుగోళ్లు పరిమితంగా ఉన్నందున అత్యధిక సరుకు శీతల గిడ్డంగులకు తరలిస్తున్నారు.గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు రూ. 17,000-19,000,అత్యధిక సరుకు రూ.18,000-19,000,డీలక్స్ రూ. 19,200,బడిగ 2043 రూ. 25,000-30,000,డీలక్స్ రూ. 31,000–32,000,బడిగ 355 రూ. 20,000-23,000,డీలక్స్ రూ. 23,500,5531 సింజెంట బడిగ రూ. 18,000-20,500,డీలక్స్ 21,000, డిడి రూ. 20,000-22,500,డీలక్స్ రూ. 23,000,దేశవాళీ సరుకు రూ. 19,000-21,000,
సుపీరియర్ రూ. 22,000-22,500,బిసిఎం రూ. 19,000-20,500,డీలక్స్ రూ. 21,000,నెంబర్-5 రూ. 18,000-22,000,
డీలక్స్ రూ. 22,500-23,000,కుబేరా, 273 రూ. 20,000-23,000,సూపర్-10, 334 రూ. 19,000-22,000,డీలక్స్ రూ. 22,500-23,000,ఆర్మూరు రకం రూ. 16,500-18,000,డీలక్స్ రూ. 18,300,రోమి రూ. 17,000-18,000,డీలక్స్ రూ. 18,200,షార్క్ మరియు షార్ప్ రూ. 17,000-18,000,క్లాసిక్ రూ. 17,500-19,000,డీలక్స్ రూ. 19,500,బంగారం రూ. 17,000-18,500,డీలక్స్ రూ. 19,000,బుల్లెట్ రూ. 18,000-20,000,పసుపు పచ్చ సరుకు రూ. 20,000- 24,000,
తాలు కాయలు తేజ రూ. 11,500-13,500,ఇతర రకాలు రూ. 8500-11,500,సీడ్ రకం తాలు కాయలు రూ. 10,000-13,500 ధరతో వ్యాపారమైంది.ఖమ్మం శీతల గిడ్డంగులలో 11 లక్షల 55 వేల 300 బస్తాల తేజ మిర్చి నిల్వ అయినట్లు సమాచారం. ఖమ్మం మార్కెట్లో గత వారం వరకు 1 లక్ష 60 బస్తాల సరుకు రాబడి కాగా, తేజ నాణ్యమైన సరుకు రూ. 19,300,మీడియం తేజ రూ. 19,000,తాలు కాయలు తేజ నాణ్యమైన సరుకు రూ. 10,500-11,500 మరియు 20-25 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ రూ. 19,000 మరియు
వరంగల్ మార్కెట్లో గత వారం 1 లక్ష 35 వేల బస్తాల మిర్చి రాబడి కాగా,తేజ రూ. 18,000-19,800,
341 రూ. 19,500-22,400,వండర్ హాట్ రూ. 27,000-36,000,దీపిక 27,000-30,500,5531 రూ. 19,500-21,000,
టమాటా రూ. 38,000–43,000,సింగల్ పట్టి రకం రూ.37,000-44,000 ధరతో వ్యాపారమైంది.హైదరాబాద్ మార్కెట్లో కర్నూలు, గద్వాల ప్రాంతాల నుండి వారంలో సుమారు 20-25 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై
తేజ రూ. 15,000-19,500,సూపర్-10 రూ. 18,000-21,000,ఆర్మూర్ రకం రూ. 14,000–17,000,273 రూ. 18,000-21,500,సి-5, డిడి రూ. 15,7 0-22,700,సింజెంట బడిగ రూ. 17,000-21,000,341 రూ. 18,700-21,500,
2043 రూ. 28,700-35,000,తాలు కాయలు తేజ. రూ. 9000–12,000,ఇతర రకాలు రూ. 8000-11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ, గురువారాలలో కలిసి 3 లక్ష 40 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బి డీలక్స్ రూ.60,000-65,000, నాణ్యమైన సరుకు రూ. 45,000-48,000,కెడిఎల్ డీలక్స్ రూ. 48,000-52,000,నాణ్యమైనసరుకు రూ.43,000-46,000,2043 రూ. 32,000-40,000,మీడియం రూ. 22,000-28,000 మరియు 5531 డీలక్స్ రకం రూ. 20,500-22,200, నాణ్యమైన సరుకు రూ. 17,500-19,500, మీడియం బెస్ట్ రూ. 15,000–16,500, డిడి రూ. 20,000- 23,000,రుద్ర బడిగ రూ.20,000-28,000,సూపర్-10 రకం రూ. 7,000-20,000,కెడిఎల్ మీడియం రూ. 22,000-25,000,మీడియం బెస్ట్ రూ. 28,000-32,000,తాలు కాయలు 10,000-2,500 మరియు 5531 తాలు కాయలు రూ. 11,000-13,000 మరియు 5531 లాల్ కట్ రూ. 13,000-15,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హుబ్లీలో గురువారం నాడు 10 వేల బస్తాల మిర్చి రాబడి కాగా, డబ్బి బెస్ట్ రకం రూ. 44,000–53,000,కెడిఎల్ డీలక్స్ రూ. 51,000-55,000,బెస్ట్ రూ. 40,000-49,000 మరియు 2043 డీలక్స్ రూ. 33,000-37,000,మీడియం రూ.29,000-32,0000,కెడిఎల్ మీడియం రూ.25,000-30,000 మరియు
5531 రకం రూ. 19,000–22,500,సి-5 రకం రూ. 18,000-22,000,కెడిఎల్ లాల్ కట్ రూ. 32,000-36,000,
తాలు కాయలు రూ. 12,000-25,000 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది.