Listen to this article

జనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల బిజెపి అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆర్ ఐ రజినీకాంత్ రెడ్డి కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి బిజెపి జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా రాష్ట్రంలో విడ్డూరంగా పాలన కొనసాగిస్తున్నది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన పథకాలలో ఇప్పటివరకు కూడా మహిళలకు 2500 రూపాయలు నిరుద్యోగ భృతి ఆసరా పింఛన్లు రైతు భరోసా విద్యార్థులకు స్కాలర్షిప్ రైతులకు యూరియా కొరత కళ్యాణ లక్ష్మికి సంబంధించిన తులం బంగారం ఇండ్లు ఇప్పటివరకు ఏ ఒక్కటి అమలు చేయకుండా రాష్ట్రంలో అబద్ధాలు చెబుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది ఈ విధమైన పాలన కొనసాగించినట్లయితే భవిష్యత్తులో కచ్చితంగా బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు కార్యక్రమాలు చేస్తామని ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్ర రెడ్డి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు భీమ్సేన్ రావు మండల ప్రధాన కార్యదర్శి మహేష్ బిజెపి సీనియర్ నాయకులు భగత్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ రాజశేఖర్ భీమన్న మరియు తదితరులు పాల్గొన్నారు